రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 15, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంతంలో సుధాకర్ మదనక్క దంపతులు గతం ముప్పై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు.సుధాకర్ కు గత ఆరు సంవత్సరాలుగా ఆరోగ్యం బాగోలేదు.మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పక్షవాతం వచ్చి మంచంలోనే ఉంటున్నాడు. సుధాకర్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో గమనించిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆర్థిక సహాయం అందించారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు అందించడం జరిగిందని చారిటబుల్ అధ్యక్షుడు లక్ష్మణరావు గౌరవ అధ్యక్షులు భూమేష్ తెలియజేశారు. పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేయూతనిస్తామని చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కుమార్, సభ్యులు మహేందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.