అంత్యక్రియలకు ఆర్థిక సాయం.

బీజేపీ నాయకుడు ఎంజేర్

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామానికి చెందిన సాకలి పెద్ద సాయిలు అనారోగ్యంతో గురువారం సాయంత్రం మరణించడం జరిగింది. బీజేపీ మండల నాయకుడు రేపని శ్రీను ద్వారా ఈ విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేర్ ) వారి మృతికి సంతాపం తెలిపి తక్షణ ఆర్థిక సహాయం 5000/- రూపాయలు బీజేపీ మరియు ఎంజేర్ ఊరుకోండ మండల యువసేన నాయకుల ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఒర్సు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, బిజేవైఎం అరవింద్, బాలస్వామి,అంజన్ రెడ్డి,సురేష్, శ్రీశైలం, గణేష్, ఆంజనేయులు(మాస్), సందీప్ కుమార్,బండి మల్లేష్,లక్ష్మణ్ కుమార్ గౌడ్,మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!