10వ తరగతి స్నేహితునికి ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచిన తోటి స్నేహితులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా),

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని శ్రీరాములుపేట గ్రామానికి చెందిన కోల సంతోష్ అనే యువకుడు గత నెల రోజుల క్రితం ట్రైన్ యాక్సిడెంట్ లో మరణించగా అతనితో 2010 సంవత్సరం 10 వ తరగతి చదువుకున్న తోటి స్నేహితులంతా కలిసి ఈరోజు అతని కుటుంబాన్ని పరమర్శించి, వారికి ధైర్యాన్ని ఇచ్చి, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. సంతోష్ కుటుంబానికి 41000/-(నలభై ఒక వేయి) రూపాయలు ఆర్థిక సహాయంగా అందివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అతని స్నేహితులు సదానందం,మారుతి, శంకర్,రఘు,కుమార్,ప్రసాద్ సుధాకర్, రాము, భాస్కర్,మధు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version