వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామనికి చెందిన అజుమియా (ఆజ్జు ) అనే యువకుడు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినాడు. అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన తోటి స్నేహితులు అతనితో 1995-1996 సంవత్సరం పదో తరగతి చదువుకున్న తోటి స్నేహితులంతా కలిసి ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపి అజ్జు భార్య షరీఫా కుటుంబ సభ్యులకు 20000/- (ఇరవై వేల రూపాయలు)ఆర్థిక సహాయాన్ని అందివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, కర్ర కుమార్ రెడ్డి, తాటిపాముల శ్రీనివాస్, గట్టు వీరస్వామి, పైడిమల్ల శ్రీనివాస్, కూచన పల్లి కుమారస్వామి, పోతుల సురేష్,కుటుంబ సభ్యులు ఎండి మహబూబ్, ఎండి షరీఫ్, ఎండి రిజ్జు తదితరులు పాల్గొన్నారు.