ఎంసిపిఐ(యు) హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి
హన్మకొండ, నేటిధాత్రి:
ఎంసీపీఐ(యు) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాధిక గుప్తా గారి నీ కలిసి మెమోరాoడం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ రెడ్డి హంసారెడ్డి మాట్లాడుతూ 2020 -2021 సంవత్సరంలో జరిగిన 14 నెలల రైతు పోరాటంలో దాదాపు 950 మంది రైతులు మరణించారు ఆ పోరాట ఫలితంగా ప్రధానమంత్రి గారు రైతు నల్ల చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటన చేసి సుమారుగా సంవత్సరం దాటింది అయినా రైతుల డిమాండ్లను ఇప్పటివరకు నెరవేర్చలేక పోవడం సిగ్గుచేటు ఆని వారు అన్నారు.దాని కారణంగా మళ్ళీ రైతులు ఫిబ్రవరి 14 2024 నుండి మలిదశ పోరాటానికి పూనుకున్నారు. ముఖ్యంగా హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర సంబంధించిన రైతులు వారి ట్రాక్టర్లలో సంవత్సరానికి సరిపడా సరుకులు నింపుకొని ఢిల్లీకి పయనమైన రైతులను మిలిటరీ బలగాలను మోపి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు రైతు ఉద్యమము ఉపసంహరించాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా
పూనుకొని రైతులు పండించిన పంటకు గిట్టుబటు ధర స్వామినాథన్ సిఫారసు ప్రకారం పార్లమెంట్ లో చట్టం చేయాలి. రుణ విముక్తి బిల్లు పార్లమెంట్ లో చట్టం చేయాలి విద్యుత్తు సవరణ బిల్లును ఉపసహరించుకోవాలని అదేవిధంగా 50 సంవత్సరాల వయస్సు పైబడిన రైతులకు 10 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మరియు రైతు ఉద్యమంలో మరణించిన వారికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నీల రవీందర్ మాస్ సావిత్రి గడ్డం నాగార్జున చీపురు ఒదయ్య జిల్లా కమిటీ సభ్యులు మొగిలి శ్రీనివాసరావు మరియు కార్యకర్తలు శేఖర్ పవని సరిత తదితరులు పాల్గొన్నారు.