రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిధిలోని వరద కాలువలో పంట పొలాల సాగు కోసం రైతులు విద్యుత్ మోటారులను అమర్చుకున్నారు. గత కొద్ది నెలలుగా గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ మోటార్ల యొక్క వైర్లను దొంగతనానికి పాల్పడుతున్నా విషయంపై పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు నిఘా పెంచడంతో పాటు రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో మంగళవారం షానగర్ గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు విద్యుత్ వైర్లను దొంగలించే సమయంలో రైతులు గుర్తించి పట్టుకోవడానికి వెళ్లగా ఇద్దరు పారిపోగా వరంగల్ జిల్లాకు చెందిన బోమ్మిశెట్టి అశోక్ అనే వ్యక్తితో పాటు మోటార్ సైకిల్ ను రైతులు పట్టుకున్నారు. దీంతో రైతులు మోటార్ సైకిల్ తో పాటు, దొంగను పోలీసులకు అప్పగించారు.