రైతుల పక్షపాతి పార్టీ బిఆర్ఎస్ పార్టీ..

# పాకాల రైతుల సంతోషం కళ్ళారా చూస్తున్నాం.
# బిఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :

తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా బిఆర్ఎస్ పార్టీకి ఘనత దక్కిందని ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటి పరిధిలోని ద్వారకాపేట రైతులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ప్రాంత రైతుల బాధలు తెలిసిన వ్యక్తిని నేను మాత్రమే అని పేర్కొన్నారు.గోదావరి జలాలతో పాకాల సరస్సు నింపి చెరువు కాలువలను ఆధునీకరించి పునరుద్ధరణ చేపట్టి ఆయకట్టు చివరి హెక్టార్ వరకు నీళ్ళందించే బాధ్యత తీసుకున్నానని ఈ నేపథ్యంలో నేడు పాకాల రైతుల సంతోషం కళ్ళారా చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.నియోజకవర్గం పట్ల ఏ ఆలోచన వస్తే దాన్ని ఆచరణలో చేసి చూపే తత్వం నాది అని నియోజకవర్గ ప్రజలను సగర్వంగా ఓట్లు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
ఇన్నేళ్ళు ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్న ప్రతిపక్షాలకు ఇంకా పదవులపై మోజు పోలేదని
మరోసారి మాయమాటలతో ఏమార్చే పనిలో ఉన్నారని ఆరోపించారు.
నర్సంపేట కీర్తిని అసెంబ్లీ సాక్షిగా చాటి చెప్పిన ఘనత తమదేనని
ప్రతిపక్ష నాయకుని లాగా నిద్రపోలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు రాయిడి రవీందర్ రెడ్డి,
పట్టణ పార్టీ అధ్యక్షుడు వెంకట్ నారాయణ గౌడ్, కౌన్సిలర్స్ మినుముల రాజు,శ్రీదేవి,యువజన విభాగం అధ్యక్షులు దుష్యంత్ రెడ్డి,
క్లస్టర్ బాధ్యులు, ముఖ్య నాయకులు, వార్డుల అధ్యక్షులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version