ఎండిపోతున్న పంట చేనులు
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లోని రైతులు యాసింగిలో ఎక్కువగా ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు అయితే ఎస్సారెస్పీ నీళ్లు ఆశించినంతగా రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. 20 రోజులుగా పంట భూములకు నీళ్లు లేక నెర్రలు పడి ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు పంటలకు అవసరమైన సాగు జలాలు సాఫీగా అందించేందుకు పై చర్చించి రైతులకు న్యాయం చేయాలని కోరడమైనది.
నీళ్లుచ్చి రైతులను ఆదుకోవాలి
శాయంపేట మండలంలోని రైతులు 15 రోజులుగా పంట భూములకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. నీళ్లు సరిగా అందక పంటలు ఎండి పోతున్నాయి సర్కారు కరెంటు బాగా ఇస్తే పంట భూములు ఆరోగ్యవంతంగా ఉంటాయని రైతులు వాపోతున్నారు.
ఐదు ఎకరాలు నెర్రలు పడి ఎండిపోతున్న పంటలు.
రైతులు యాసంగిలో ఎక్కువగా ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు నీళ్లు చివరి ఆనకట్టు వరకు అందగా ఇప్పుడు పూర్తిగా ఎస్సారెస్పీ 15 రోజుల నీళ్ల మీదనే ఆధార పడాల్సి వస్తుంది 15 రోజులకు ఒకసారి ఇస్తున్న చివరి ఆయకట్టు భూములకు వరకు అందేలా ఇస్తలేరు దీనితో పంటలు ఎండిపోతున్నాయి అయితే సర్కార్ 24 కరెంటుతో పాటు ఎస్సారెస్పీ నీళ్లు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. సింగారం నుండి శాయంపేట ఆయకట్టు వరకు సుమారుగా 600 నుండి 1000కరాల వరకు ఆయకట్టు సాగునీరు ద్వారానే వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చివరి ఆయకట్టు వరకు అందిం చేటట్లు చూడాలని రైతులు కోరడుతున్నారు ఈ కార్యక్రమంలో దానబోయిన సుధాకర్, అశోక్, సాధు కుమారస్వామి రైతులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.