ఎండపల్లి నేటి ధాత్రి
మండలంలో విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎండపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన చెల్పూరి రాజేశం (53)అనే రైతు తనకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న పంట కొరకు అడవి పందుల నుండి పంటను కాపాడుకోవడానికి చుట్టూ జే వైరుతో కంచలాగా అమర్చి విద్యుత్ తీగతో కనెక్షన్ ఏర్పాటు చేశాడు, కాగా ఎప్పటిలాగే పంటకు సాగునీరు అందించడం కోసం తన వ్యవసాయ క్షేత్రంలోకి మంగళవారం ఉదయాన్నే వెళ్లిన రాజేశం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
