నర్సంపేట,నేటిధాత్రి :
జూన్ నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అందించి ఆదుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట పట్టణ యూత్ నాయకులు బొల్లెపెల్లి కమల్ కుమార్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు డబ్బులు రైతులకు మే, జూన్ నెలలోనే రైతుల ఖాతాలో జమ చేసిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కొత్తగా రైతు భరోసా పథకానికి నియమ నిబంధనలు ఇప్పటివరకు ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేయాలని కమల్ కుమార్ డిమాండ్ చేశారు.