ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షులు షబ్బర్ ఓద్దీన్
మందమర్రి, నేటిధాత్రి:-
మజీద్, ఈద్గా, ఖబ్రస్తాన్ లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షులు షబ్బర్ ఓద్దీన్ గురువారం మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బర్ ఓద్దీన్ మాట్లాడుతూ,
ఈనెల 10వ తేదీ నుండి ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నందున ముస్లిం సోదరుల సౌకర్యార్థం మసీద్, ఈద్గా, ఖబ్రస్తాన్ లలో మెరుగైన సౌకర్యం కల్పించాలని, పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకోవడం జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలోని 4 మజీద్ లు, మండలంలోని గ్రామాలలో ఉన్న మజీద్ ల వద్ద ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ఖబ్రస్తాన్ ల చుట్టూ చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయాలని అంతే కాకుండా వీది దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నిజాంఓద్దీన్, నియజ్, సమీర్, జావిద్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.