మాజీ ఎంపీ వినోద్ కుమార్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టం ద్వారా ఏర్పడిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని అన్నారు.
జాతీయ రహదారి 365 సూర్యాపేట నుండి దుద్దెడ వరకు ఉండేది, దుద్దెడ నుండి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు రహదారి విస్తరించాలని ప్రతిపాదించడం జరిగిందని అన్నారు.
జాతీయ రహదారి కోరుట్ల నుండి దుద్దెడ వరకు వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాధించామని అన్నారు.
బండి సంజయ్ తిట్ల పురాణం బందు చేసి జాతీయ రహదారి కోసం ఎక్సటెన్షన్ చేయాలని కోరుతున్నమని అన్నారు.
సిరిసిల్ల నుండి పాములాగా రహదారి వేస్తున్నారు దానిని విరమించుకోవాలని అన్నారు.సిరిసిల్ల లో ఉన్న మధ్య తరగతి ప్రజలు రహదారిలో జాగలు కోల్పోతున్నారని అన్నారు.
రైల్వే లైన్ ఎలా వస్తుందో దాని ప్రక్కన రహదారి వేసేలా కృషి చేయాలని అన్నారు.రాజమండ్రి లో ఉన్న మాదిరిగా తెలంగాణలో రైల్వే కం బ్రిడ్జి రహదారి నిర్మాణం చేయాలని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని అన్నారు.
హైదరాబాద్ నుండి విజయవాడ, ఆర్మూరు నుండి జాగ్దేవ్ పూర్ వరకు రెండు రహదారులు రావడం జరుగుతుందని అన్నారు.
రెండు జాతీయ రహదారిలు ఎక్సటెన్షన్ అయ్యేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తో మాట్లాడి బండి సంజయ్ కృషి చేయాలని అన్నారు.రహదారి విస్తరణ ఎక్సటెన్షన్
చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు.మంచి రోడ్డు లేకపోతే మనమే నష్టపోతామని అన్నారు.
భూములు కోల్పోయిన వారికి రెట్టింపు పరిహారం ఇవ్వాలని అన్నారు