బలరాం నాయక్ విజయానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం.

#అత్యధిక మెజార్టీతో గెలిపించిన మండల ప్రజలకు ధన్యవాదాలు.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మరొక్కసారి పార్లమెంటుకు పంపిన మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎంపీ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్ల నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది చెందడం వల్ల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని భావించి మండలంలోని ప్రజలు ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించడం సంతోషకరమని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండల అభివృద్ధి కొరకై అహర్నిశలు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు తీసుకొని కృషి చేస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాలోతు రమేష్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్, నాయకులు చరణ్ సింగ్, రామ్మూర్తి, ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version