* కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్..
చేర్యాల నేటిధాత్రి…
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్ పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం తమ వార్డులోని మున్సిపల్ సిబ్బందితో కలిసి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ప్రజల మనుగడకు చెట్లు పెంచాలని తెలిపారు. రోడ్ల వెంబడి నాటే మొక్కల విషయంలో విద్యుత్ వైర్లకు ఇబ్బందులు కాకుండా చిన్నగా పెరిగే మొక్కలను విద్యుత్ వైర్లు ఉన్నచోట నాటుతూ లేనిచోట ఏపుగా మొక్కలను నాటాలన్నారు. మొక్కలు నాటి సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్క సంరక్షణ చూసుకోవాలన్నారు. అకారణంగా చెట్లు నరికితే జరిమానను ఆ వ్యక్తులకు తప్పక విధించాలన్నారు భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనిషికి ఒక మొక్క నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు