ఓసి ప్రాజెక్టు అధికారి గోవిందరావు
రామకృష్ణాపూర్ ,నేటిధాత్రి:
పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను సైతం తీసుకోవాలని రామకృష్ణాపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ అధికారి ఎం గోవిందరావు పిలుపునిచ్చారు. శుక్రవారం రామకృష్ణాపూర్ ఉపరితల గని లో మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా హరిత ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి గోవిందరావు మాట్లాడుతూ…. కార్మికులు, ప్రజలు అందరూ తమ యొక్క జీవన శైలిని మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సుధీర్ జక్కులవార్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఏ ఆంజనేయులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులు పాల్గొన్నారు.