ఎంవిఐ సంఘం వెంకట పుల్లయ్య
భద్రాచలం నేటి ధాత్రి
రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం భద్రాచలం రవాణా శాఖ యూనిట్ ఆఫీస్ భద్రాచలం కార్యాలయంలో. లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్, ఆటో రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ కు వచ్చిన వాహన దారులకు రోడ్ సేఫ్టీ భద్రత ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన జాగ్రత్తలపై రవాణా శాఖ అధికారి సంఘం వెంకట పుల్లయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించడం, వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్ అనుసరించడం, వాహనాలను ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, సీటు బెల్ట్ డ్రైవింగ్, మూల మలుపుల వద్ద నిదానంగా వెళ్లడం హారన్ కొట్టడం రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కాగా పాటించవలసిన అంశాలు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక దూరం ప్రయాణించినప్పుడు ముందురోజు విశ్రాంతి తీసుకోవడం, శీతాకాలం వర్షాకాలంలలో రోడ్డుపై ప్రయాణించే సమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వాహనదారులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు
ఈ క్రమంలో కార్యాలయం కు వచ్చిన వారితో నియమ నిబంధనలు పాటిస్తాను అనే ప్రతిజ్ఞ కూడా ప్రతి ఒక్కరితో చేయించారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, తేదీ జనవరి 1 నుండి 31, వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ సంఘం వెంకట పుల్లయ్య అన్నారు.