నిట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్
అండర్ 19 జూనియర్ కళాశాల పోటీలకు అద్భుత స్పందన
“నేటిధాత్రి” వరంగల్
ప్రస్తుత సమాజంలో క్రీడలు ప్రతీ ఒక్కరికి అవసరమని ప్రతిష్టాత్మకమైన నిట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. శనివారం జె ఎన్ ఎస్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 పోటీలకు హనుమకొండ డివైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. ప్రస్తుత ఒత్తిడి ప్రపంచంలో ప్రతీ ఒక్కరు వ్యాయామం చేయాలని సూచించారు. ముఖ్యంగా జూనియర్ కళాశాలల క్రీడాకారులు క్రీడలపై ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు. ఈ ఏజ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎదగడానికి మంచి అవకాశమని, ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన క్రీడాకారులు ఈ వయసు నుంచే కష్టపడి పైకి వచ్చారని సూచించారు. ఇంత పెద్ద ఎత్తున అండర్ 19 పోటీలను నిర్వహిస్తున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ కుమార్ ను అభినందించారు. హనుమకొండ డివైఎస్ఓ, పోటీల నిర్వాహకులు గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 29 వరకు ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. మంచి అహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పటివరకు 24 క్రీడాంశాలలో పోటీ నిర్వహించామని అన్నారు. శనివారం జరిగిన వివిధ క్రీడాంశంలో పోటీలకు దాదాపు 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరము ముఖ్యఅతిథి డాక్టర్ రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారుల మధ్యలో కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హరి, రమణ, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సృజన్ కుమార్, రవికుమార్, శ్యాం ప్రసాద్,ప్రభాకర్ గౌడ్, కృష్ణారెడ్డి, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, కోచులు పాల్గొన్నారు