ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు కలిసికట్టుగా కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట గణపురం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. వారందరికీ ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాడి నుండి నేటి వరకు ఎప్పటికీ కొత్త పాత తేడా లేకుండా ప్రతి కార్యకర్తకు కంటి రెప్పల కాపాడుకుంటానని సమయం వచ్చినప్పుడు అవకాశాన్ని బట్టి అందరికీ న్యాయం జరిగేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్యను అధిక మెజారిటీతో గెలిపించి తద్వారా నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ అనిధులు తెచ్చుకునే విధంగా మీ అందరి సహకారం కావాలని ఎమ్మెల్యే కోరారు. మీరు వెంట రెండు మండలాల నాయకులు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version