ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా.

#బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి

నల్లబెల్లి, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది అన్నారు బుధవారం మండలంలోని దస్తగిరి పల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పులి రమేష్ తో పాటు పలువురు మండల పార్టీ కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో పార్టీలో చేరగా వారికి బిఆర్ఎస్ పార్టీ కండువప్పి పెద్ది సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిఅనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే అగ్రగామి నిలిపిన ఏకైకవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గాన్ని గత పాలకులు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఒక్కసారి అవకాశం ఇస్తేనే ఇంతగా అభివృద్ధి చేశానని మరొకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని తనపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు పెండ్యాల సుధాకర్, భాష బోయిన రాజు, గుంపుల రాజు, అల్లే రజనీకాంత్, గంగారబోయిన సాగర్, పార్టీలో చేరిన వారు గంగరబోయిన శ్రీధర్, ఎల్ల బోయిన కట్టయ్య, బాలు, గంగరబోయిన ప్రశాంత్, లక్ష్మయ్య, ఆవు నూరి హరీష్, పుట్టపాక బిక్షపతి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version