అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సంగే పోగు సరోజమ్మ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ బస్టాండ్ ఎదురుగా అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సంగే పోగు సరోజమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు చల్లటి నీరు అందించే విధంగా ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్త య్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు, తెలిపారు.ఈ కార్యక్రమంలో గండీడ్ మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కప్లపూర్ ఆశన్న, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గుముడాల చెన్నప్ప, రంగారెడ్డిపల్లి వివేకానంద,అంజలి,శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version