భద్రాచలం నేటి ధాత్రి
ఈ రోజు మారుతి నర్సింగ్ కళాశాల వద్ద 42 మందికి కంటి చూపు ఆపరేషన్స్ కొరకు పుష్పగిరి కంటి ఆసుపత్రి హైదరాబాద్ క వెళ్ళే వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన పర్యావరణ ప్రేమికులు లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు, లయన్ జి. శివ శంకర్ రావులు. ఇప్పటివరకు 742 మందినీ కంటి ఆపరేషన్లు చేయుటకు పంపగా 736 మందికి కంటి ఆసుపత్రి లో ఆపరేషన్స్ విజయవంతం గా నిర్వహించి అందరికీ కళ్లజోళ్లు జిల్లా కలెక్టర్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయటం జరిగినది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , మారుతి నర్సింగ్ కళాశాల, లయన్ క్లబ్ మరియు వాసవి క్లబ్ usa వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగినది . ఈ కార్య్రమానికి ఎంతో శ్రమించి విజయ వంతం చేయటం లో తనదైన ముద్రను వేశారు శ్రీ లయన్ dr. యెస్ ఎల్. కాంతా రావు అధ్యక్షులు, రెడ్ క్రాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లయన్ వేగి సూర్యనారాయణ స్టేట్ రెడ్ క్రాస్ కౌన్సిల్ మెంబర్, సీతారాం రెడ్డి, సెక్రటరీ, నర్సింగ్ స్టాఫ్ ,విద్యార్థినులు మరియు కంటి ఆపరేషన్ కొరకు వెళ్ళే వారి బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతా రావు మాట్లాడుతూ 742 మందికి నేత్రదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అదేవిదంగా ఈ కార్యక్రమానికి సహకరించి న అందరికీ కృతజ్ఞతలు తెలియ చేసారు. ఇట్లు డాక్టరు ఏస్. యెల్ కాంతా రావు అధ్యక్షులు రెడ్ క్రాస్ సొసైటీ,భద్రాచలం. యోగి సూర్యనారాయణ స్టేట్ కౌన్సిల్ మెంబర్.