ఎండపల్లి (జగిత్యాల ) నేటి ధాత్రి,
తెలంగాణ రాష్ట్రం లో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ తీవ్రంగా ఖండించారు.
అనంతరం ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ పథకాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాల నుంచి అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.రైతుబంధు పథకాన్ని ఆపివేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి బట్టే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదును తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు అర్థం చేసుకోవాలని ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ పార్టీ వారు మరియు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని జగన్ అన్నారు.,ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండల బిఆర్ఎస్ అద్యక్షులు సింహాచలం జగన్,బీఆర్ఎస్ పార్టీ నేతలు, మహిళా నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు,