అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయం!!!!
అద్దె చెల్లించక పోవడంతో తాళం వేసిన యజమాని!!!
స్థానిక ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్ హామీతో తెరుచుకున్న కార్యాలయం!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి నూతన మండల తహాశీల్దార్ కార్యాలయానికి యజమాని తాళం వేసిన సంఘటన చోటుచేసుకుంది ఎండపల్లి మండల కేంద్రంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అక్టోబర్ 21,2022 లో ప్రారంభించడం జరిగింది, అప్పటినుండి ఇప్పటివరకు రాయిల్ల భూమేష్ తండ్రి రాజయ్య గారి నాలుగు సెంటర్లు 8 రూములు కలిగిన భవనంలో అద్దె చెల్లించుటకు గాను ప్రతినెల 24 వేల రూపాయలు చెల్లించుటకు అంగీకారం చేసుకొని, గత నూతన తహశీల్దార్ కార్యాలయం ఏర్పడి దాదాపు 15 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అద్దె చెల్లించకపోవడంతో నాన కష్టాలు పడి ఇళ్లు నిర్మించుకోవడం జరిగింది అని తప్పని పరిస్థితుల్లో అద్దె ఇవ్వకపోవడంతోటే తహశీల్దార్ కార్యాలయానికి తాళం వేయడం జరిగిందని,అద్దె ఇప్పించండి అని కోరారు, ఈ సమయంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది కాసేపు బయటే వేచి ఉండడం జరిగింది ,ఇట్టి విషయం , ఎండపల్లి స్థానిక ఎంపీటీసీ సభ్యులు మహ్మద్ బషీర్ స్పందించి ప్రభుత్వ విప్ ,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పూర్తి హామీ ఇవ్వడంతో ఇంటి యజమాని వెంటనే తాళం తెరిచి కార్యాలయం తెరవడం జరిగింది