వరంగల్ /గీసుకొండ,నేటిధాత్రి :
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సీనియర్స్ ఖో ఖో కోచింగ్ క్యాంపు ముగిసింది.ఈ సమావేశానికి గీసుకొండ హై స్కూల్ హెడ్మాస్టర్ పట్టాభి అధ్యక్షత వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి హాజరయ్యారు. వరంగల్ జిల్లా జట్టును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జంగా రాఘవరెడ్డి క్రీడాకారులకు సూచించారు.కోచింగ్ క్యాంపు ఇన్చార్జి కోట రాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు సుమారు 45 వేల రూపాయల టి షర్ట్స్, షాట్స్ లతో పాటు ట్రాక్ అండ్ షూట్ స్పాన్సర్ చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అల్లం బాల కిషోర్ రెడ్డి, 20 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన పెగళ్లపాటి లక్ష్మీనారాయణ,అలాగే మరి కొంత మంది దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు,పాఠశాల అధ్యాపక బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.