పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దానిలో భాగంగా హనుమకొండ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా పరకాల పట్టణానికి చెందిన ఎల్తూరి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.పరకాల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఎల్తూరి శ్రీనివాస్ గత కొద్ది సంవత్సరాలుగా స్వేరో ఇంటర్నేషనల్ స్వేరో పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిఎస్పీలో చేరిన తర్వాత బహుజన సమాజ్ పార్టీలో చేరి గ్రామస్థాయి నుండి అసెంబ్లీ అధ్యక్షులుగా పనిచేస్తున్న క్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా ఎల్తూరి శ్రీనివాస్ ని నియమించడం పట్ల బిఎస్పీ పరకాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎండి అంజాద్ పాషా,పరకాల మండల అధ్యక్షులు పెండెల మహేందర్,నదికూడా మండల అధ్యక్షులు శనిగరపు వెంకటేష్, దామెర మండల అధ్యక్షులు ముత్యాల నరేందర్,ఆత్మకూరు మండలం కన్వీనర్ ఆర్షం మధుసూదన్,సంగెం మండల నాయకులు పరకాల శ్రీకాంత్, గుండేటి మధు,దామెర రాజేందర్,గీసుకొండ మండల నాయకులు టీ.శివశంకర్ తదితరుల హర్ష వ్యక్తం చేశారు.బహుజన సమాజ్ పార్టీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్ తెలియజేశారు.