మెట్ పల్లి జనవరి 21 నేటి ధాత్రి
మెట్ పల్లి పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సహకార సంఘం భవనంలో నాయి బ్రాహ్మణ సేవా సహకార సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. నూతన అధ్యక్షులుగా ముత్యాల రమేష్ , ఉపాధ్యక్షులుగా నడికుడ పెద్ద సాయన్న , కోశాధికారిగా చిట్యాల సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా సమ్మెట గంగాధర్, సహాయ కోశాధికారి పసునూరి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా చింతకుంట రాజా గంగారం, కొదురుపాక నడిపోల్ల నడిపి ముత్తయ్య , మద్దూరి బాలగంగాధర్, రాసమల్ల శ్రీహరి, చింతకుంట రవి, రాచకొండ లక్ష్మణ్, ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సంఘం సభ్యులు ఘనంగా సాల్వతో సన్మానం చేశారు. మరియు నూతన అధ్యక్ష కార్యవర్గం మాజీ కార్యవర్గ సభ్యునికి సన్మానం చేయడం జరిగింది. ఇట్టి సందర్భంగా నూతన అధ్యక్షులు ముత్యాల రమేష్ మాట్లాడుతూ సంఘం కోసం అహర్నిశలు కష్టపడి సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, సభ్యులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మెట్పల్లిలోని నాయిని బ్రహ్మ సేవా సహకార సంఘం ఎన్నికలు నూతన అధ్యక్షులు
