నర్సంపేట,నేటిధాత్రి :
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నర్సంపేట మండల కమిటీ ఎన్నిక డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.ముఖ్య అతిధులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనాంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్ హాజరయ్యారు.
మండల గౌరవ అధ్యక్షులు గంధసిరి సాంబరాజు గౌడ్,మండల అధ్యక్షులు జనగాం మల్లికార్జున్,వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఖైరి బక్షపతిగౌడ్,కట్ల సుధాకర్ గౌడ్,ప్రధాన కార్యదర్శులు రాక రాజలింగం గౌడ్,పోషాల రాంబాబు గౌడ్,
ఉపాధ్యక్షులు గౌడిశాల అశోక్ గౌడ్,బత్తని అశోక్ గౌడ్,వేముల విజయ్ గౌడ్, దూపటి కుమార్ గౌడ్,
కార్యదర్శులు ఆరెల్లి రాజేందర్ గౌడ్, మర్ధ రమేష్,దూపటి మధు సూదన్ గౌడ్,ప్రచార కార్యదర్శులు గట్టిపర్తి శివశంకర్ గౌడ్, బెల్లంపల్లి రమేష్ గౌడ్,
దూపటి ప్రభాకర్ గౌడ్, అధికార ప్రతినిధి దూపటి మనహర్ గౌడ్, సోషల్ మీడియా ప్రతినిధి మర్ధ సంతోష్ గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా హాజరైన వారు మాట్లాడుతూ గౌడ కులస్తుల హక్కుల కోసం నిత్యం పోరాటం చేస్తున్న ఏకైక సంఘం మోకుడెబ్బ అని అభివర్ణించారు. ఐక్యంగా ఉంటేనే భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుకుపోవచ్చన్నారు.నాలుగు దశాబ్దాల క్రితమే భహుజన రాజ్యాధికారాన్ని చేపట్టిన గౌడ కులస్తుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు.ఆయన ఆశయాలను ప్రతీ గౌడ కులస్తులు ఆర్థికంగా,రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొడిశాల సదానందం గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్రంథాలయ సంస్థ వరంగల్ జిల్లా డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, రాష్ట్ర నాయకులు మచ్చిక రాజు గౌడ్, మచ్చిక నర్సయ్య గౌడ్,జిల్లా నాయకులు జూలూరి హరిప్రసాద్ గౌడ్,దొంతి సంతోష్ గౌడ్, బొడిగె మల్లేశం గౌడ్, కొయ్యడి సనత్ గౌడ్,మర్ధ గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.