తాటి రమేష్, కల్తి ప్రమోద్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రగతిశీల యువజన సంఘం గుండాల మండల,అధ్యక్ష కార్యదర్శులుగా తాటి రమేష్,కల్తి ప్రమోద్ లను ఎన్నుకున్నట్లు ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పర్శక రవి తెలిపారు.
ఈ సందర్భంగా పర్శక రవి మాట్లాడుతూ నూతనంగా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన తాటి రమేష్, కల్తి ప్రమోదులు విద్యార్థి,యువజన రంగ సమస్యలపై దృష్టి పెట్టి వారి సమస్యలు పరిష్కారం కోసం పోరాడాలని కోరారు.
భారీగా వర్షాలు కురుస్తున్న మూలంగా మండల ఎంపీఓ అధికారి గ్రామాలలో పారిశుద్ధ్యం సమస్యలపై దృష్టి పెట్టాలని, దోమల నివారణకు పాసింగ్ పనులు చేపట్టాలని కోరారు.
అలాగే గుండాల మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.