డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మొగుళ్ళ పల్లి మండల యువజన సంఘం ఎన్నిక

నూతన అధ్యక్షులుగా మంగళపెళ్లి శ్రీనివాస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ములకలపల్లి మొగుళ్లపల్లిశ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు పుల్ల ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు నూతన అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పుల్ల మల్లయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం వారి శ్రేయస్సుకోసం భారత రాజ్యాంగంలో పొందపరచి వారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని పది సంవత్సరాలు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆనాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమై రిజర్వేషన్ పొడిగిస్తూ వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కులమత బేధాలు లేకుండా ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా భారత రాజ్యాంగాన్ని పొందుపరిచారు అగ్ర వర్గాలు మనపై పేత్తనం చేస్తూ మనల్ని అనగ దుక్కుతూన్నారు కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏకమై వారిని తిప్పికొడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జోగుల రాజు , జిల్లా నాయకులు జెన్న యుగేందర్ పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ,గౌరవాధ్యక్షులు సుదమల్ల కిషన్ వేములపల్లి గ్రామం, మండల అధ్యక్షులుగా మంగళపల్లి శ్రీనివాస్, మొగుళ్ళపల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నిమ్మల భద్రయ్య ఎల్లారెడ్డి పల్లె, ఉపాధ్యక్షుడిగా మంద తిరుపతి మెట్టుపల్లి గ్రామం, రేణిగుంట్ల చందర్ పోతుగల్లు,ప్రధాన కార్యదర్శిగా జనుప మేఘనాదం గుడిపాడు, కోశాధికారిగా శరీరపు శ్రీనివాస్, మొగుళ్ళపల్లి, కార్యదర్శిగా బొచ్చు ప్రభాకర్ పాత ఇసిపేట, సహాయ కార్యదర్శిగా శనిగరపు రవికుమార్, మొగుళ్లపల్లి, ప్రచార కార్యదర్శిగా కల్లే పల్లి సాంబయ్య ఎల్లారెడ్డిపల్లి, చిలువేరు సదయ్య రంగాపురం, చిలివేరి సుమన్, గౌరవ ముఖ్య సలహాదారులుగా గంగాధరి రాజు గుడిపహాడ్, బడారి రవీందర్ మొగుళ్ళపల్లి ,బండారి రామస్వామి మొగుళ్ళపల్లి,మంద సుధాకర్ మెట్టుపల్లి కార్యవర్గ సభ్యులు బట్టల సదయ్య ములకలపల్లి ,మంద అజయ్ జనుప వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version