వేములవాడ రూరల్ నేటి దాత్రి
వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట, బొల్లారం, లింగంపల్లి గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మడ లక్ష్మీనరసింహారావు ఇంటింటా కరపత్రాలను పంచుతూ వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతిపక్ష పార్టీల నాయకుల కళ్లి బొల్లి మాటలను నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు కరెంటు కష్టాలు వస్తాయని హెచ్చరించారు. స్థానిక ప్రాంత ప్రజల సమస్యలను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తీరుస్తానని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండలం ఎంపీపీ బండ మల్లేశం, రూరల్ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, సింగిల్విండో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, తీగల రవీందర్ గౌడ్, ఏశ తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..