ఎస్ఐ ఉపేందర్ రావు
జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ గ్రామంలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును ధైర్యంగా వినియోగించుకోవాలని జైపూర్ మండలంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రజలకు, యువతి, యువకులకు స్థానిక ఎస్సై ఉపేందర్రావు తెలియజేశారు. ఈ ఎన్నికల సమయంలో కొందరు నాయకులు వచ్చి పక్క దారిలో పట్టించే ప్రయత్నం చేస్తారు. మీరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా మీ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవాలని అన్నారు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని తెలియజేశారు. అంతేకాకుండా ప్రజలందరికీ రక్షక బటులు అండగా ఉంటారని ధైర్యం ఇచ్చారు.