కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్
కాప్రా నేటిధాత్రి 15:
నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..
చదువు ద్వారా మాత్రమే తగిన గుర్తింపు లభిస్తుందని,భవిష్యత్ లో ఉన్నత స్థానాలకు చేరాలంటే ఇప్పుడు బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని, సబ్జెక్టులను అర్థం చేసుకొని చదవాలని కేవలం మార్కుల కోసం చదవకూడదు అని విద్యార్థులకు సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ అన్ని రకాల సదుపాయాలను సమకూరుస్తుందని,కుషాయిగూడ పాఠశాలలో ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి,ఉపాధ్యాయులు,నాయకులు పాల్గొన్నారు..