# పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు దుష్యంత్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
నేడు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై పోరాటంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి లో భాగంగా బిఆర్ఎస్వి నర్సంపేట టౌన్ ప్రెసిడెంట్ దేవోజు హేమంత్ ,బిఆర్ఎస్
యూత్ నాయకులు కమల్ లను నర్సంపేట పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు.ఈ సందర్భంగా నర్సంపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాయుడి దుష్యంత్ రెడ్డి వారిని పోలీస్ స్టేషన్ లో పరామర్శించారు.ప్రజా సమస్యలు,విద్యార్థుల పట్ల పోరాటాలు చేస్తున్న విద్యార్థి,యువజన నాయకులను అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు.పరామర్శించిన వారితో నర్సంపేట పట్టణ యూత్ జనరల్ సెక్రెటరీ నాయిని వేణు,9 వ వార్డు యూత్ అధ్యక్షులు గొడిశాల అనిల్ ,పట్టణ యూత్ ప్రచార కార్యదర్శి బీరం అనంత రెడ్డి ,17వ వార్డు యూత్ ప్రెసిడెంట్ పల్నాటీ సందీప్, అగస్టీన్ ,సాయి తదితరులు ఉన్నారు.