కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు,

లక్షటిపేట్(మంచిర్యాల జిల్లా): నేటి ధాత్రి:

లక్షెట్టిపేట పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా ముందస్తు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్ చిందం చంద్రశేఖర్ మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగని పురస్కరించుకొని విద్యార్థులకు శుక్రవారం నుండి దసరా సెలవులు ఉండటం వల్ల ఈరోజు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించామని తెలియజేశారు. ప్రపంచంలో దేవుళ్ళని ప్రతి ఒక్కరూ పూలతో పూజిస్తారు కానీ పూలనే దేవుళ్ళుగా పూజించే సంస్కృతి కేవలం మన తెలంగాణలోనే ఉండటం మన అదృష్టమని తెలిపారు. పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ రమేష్ చంద్ జైన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే బతుకమ్మ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులకు చక్కని విద్యతో పాటు, సాంప్రదాయ విలువల్ని నేర్పిస్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు పెట్టెం తిరుపతి, ఎంబడి రమేష్ పాల్గొన్నారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయునిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలకు బతుకమ్మ ఆడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!