ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలో దుద్దిళ్ళ శ్రీపాద రావు తనయుడు,ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ళ శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అభిమానులు కోలాహలంగా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,బుక్స్,పెన్నులు,పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్ల బాలాజీ, మాజీ జెడ్పిటిసి జగన్మోహన్ రావు, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజయ్య,యూత్ మండలాధ్యక్షుడు శివకుమార్, సీనియర్ నాయకులు,యువ నాయకులు,కార్యకర్తలు మహిళా కాంగ్రెస్,యువజన కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.