•అధిక మొత్తంలో డబ్బులు రవాణా చేయొద్దు
నిజాంపేట: నేటి ధాత్రి, మార్చి 23
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ పడినందున ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి శనివారం అన్నారు.. ఈ మేరకు నిజాంపేట పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పై ప్రాధాన్యత పెంచాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ పడినందున ప్రజలు ఎవరు 50 వేల కంటే అధిక మొత్తంలో డబ్బులు రవాణా చేయవద్దన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ వెంకటేష్, నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐ జనార్దన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు