మొగుళ్ళ పల్లి నేటి దాత్రి న్యూస్ అక్టోబర్ 25
ఎన్నికల కోడ్ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పెద్దవాగు బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను భూపాలపల్లి డిఎస్పీ రాములు బుధవారం సందర్శించారు. అనంతరం అటువైపుగా వెళుతున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సంభవిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టేందుకు మద్యం, డబ్బులను ఇతరాత్రా వస్తువులను పంచేందుకు వీలు లేకుండా చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ.. ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐ దాసారపు వేణు చందర్, మొగుళ్లపల్లి ఎస్ఐ జాడీ శ్రీధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.