ఎస్సై దేవేందర్ శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్,రోడ్డుప్రమాదాలు, డయల్100, బాల కార్మికులు, బాల్య వివాహాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, గుట్క,గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని మూఢ నమ్మకాలు మరియు 4 G విషయాలపై శాయంపేట ఎస్సై దేవేందర్ విద్యార్థిని విద్యార్థులకి అవగాహన కల్పించాడు. ప్రతి ఒక్కరూ ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఎస్సై తెలియజేశాడు.ఈ కార్యక్రమoలో శాయంపేట ఎస్సై దేవేందర్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎస్ శ్రీధర్,అధ్యాపక బృందం,మండల మెడికల్ ఆఫీసర్, కానిస్టేబుల్, ఆఫీసర్స్ పాల్గొన్నారు.