ఎం జె పి ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన డా,, రవీందర్

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)

మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలుర స్కూల్ ప్రిన్సిపాల్ గా డాక్టర్ టి. రవీందర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కమలాపూర్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసి బదిలీపై సైదాపూర్ వెళ్లడం జరిగింది. ప్రస్తుతం గ్రేడ్ 1 ఆఫీసర్ గా ప్రమోషన్ పై కమలాపూర్ వచ్చారు. ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన రవీందర్ ని స్థానిక కమలాపూర్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి శాలువాతో సత్కరించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం బహుకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కమలాపూర్ కు ప్రమోషన్ పై రావడం సంతోషంగా ఉందని కమలాపూర్ ఎం జె పి స్కూల్ లో నాణ్యమైన విద్య అందించడానికి తన వంతుగా కృషి చేస్తానని, పిల్లల బంగారు భవిష్యత్తుకై అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుని మంచి వాతావరణం నెలకొల్పుతానన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పుల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version