డాక్టర్ నవీన్ 100 డప్పులు బహుకరణ

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణికుంట్ల శంకర్ మాదిగ ఎంఎస్ఎఫ్ టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో
డాక్టర్ ఏకు నవీన్ తండ్రి క్రీ.శే. ఏకు మల్లేష్ జ్ఞాపకార్ధకంగా 100 డప్పులు బహుకరణ
కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇంచార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ అనంతరం డప్పులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులో జరగబోయే ఏబిసిడి వర్గీకరణ కోసం లక్ష డప్పులు వెయ్యి గొంతుల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమనికి. 100 డప్పులు కొనిచ్చిన డాక్టర్ నవీన్ కి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఇంకా మాదిగలలో ఉండబడే ఉద్యోగులు ఆఫీసర్స్ డాక్టర్స్ అందరూ పిలుపును స్వాగతిస్తూ మాదిగ జాతి ముద్దుబిడ్డలందరూ ముందుకు వచ్చి ఇంకా డప్పులు వెహికల్స్ కు అరేంజ్ చేసి ఉద్యమానికి సహకరించాలని పిలుపునిస్తూహైదరాబాదులో జరగబోయే సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నాయకులు అందరూ దళిత బిడ్డలందరూ ఈ సభకు ప్రతి ఒక్కరు డప్పు చేత పట్టుకొని అధిక సంఖ్యలో ఈ సభను ప్రపంచం తిలకించేలా సర్కారు దిగివచ్చి వర్గీకరణను అమలు చేసే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ డప్పులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద తిరుపతి రేణుకుంట్ల సంపత్ కన్నూరి సారయ్య అక్కల రాజయ్య ఇల్లందుల శంకర్ అంబాల సారయ్య అక్కల భద్రయ్య వెలిశాల గ్రామశాఖ అధ్యక్షులు బోయిని శ్రీకాంత్ బోయిని రజినీకాంత్ టేకుమట్ల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version