హక్కులు చట్టరూపం దాల్చేలా పోరాడిన ఫైటర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్……
బుడ్డ భాగ్యరాజ్…..
కొల్చారం, ( మెదక్ )నేటి ధాత్రి :-
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా బుడ్డ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చట్టాలను రూపకల్పన చేసి హక్కులు అందించడంలో కృషి చేశారు అన్నారు.
కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం చట్టసభల్లో పోరాడిన విధానం ఆయన ద్వారా పొందిన మేలు మర్చిపోలేనిదని భాగ్యరాజ్ గుర్తు చేశారు.
అతి చిన్న వయసులోని ఎమ్మెల్యేగా మంత్రిగా 50 ఏండ్ల గొప్ప పార్లమెంటరీగా 30 ఏళ్లు కేంద్రమంత్రిగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలో బాధ్యతలు నిర్వహిస్తూ ఓటమెరుగని మహానేతగా ప్రపంచ రికార్డు పొందిన వ్యక్తి హరిత విప్లవ సృష్టికర్త యుద్ధ రంగ వ్యూహకర్త జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భాగ్యరాజ్ తో పాటు తూప్రాన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పసుల నరసింహ రావు, జనరల్ సెక్రెటరీ గజ్జల కృష్ణ, వివిధ దళిత సంఘాల నాయకులు మల్లికార్జున గౌడ్, సర్గల రాములు, కాల కంటి సత్యనారాయణ, ప్రకాష్ పాస్టర్, మహమ్మద్ అప్సర్, మహేష్ యాదవ్, రవి ముదిరాజ్, బాయికాడి ఆంజనేయులు,రమేష్, పల్లెపాటి మాధవి, ఢిల్లీ పుష్ప, వివిధ నాయకులు మీడియా మిత్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.