మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
పాలమూరు పట్టణంలో అర్హత లేని జర్నలిస్టులకు అలాగే జర్నలిస్టు కాలనీలో బిఆర్ఎస్ కార్యకర్తలకు గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్స్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించారని, ఈడబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై మరోసారి విచారణ చేసి అక్రిడేషన్ కార్డుతో పాటు ప్రస్తుతం ఫీల్డ్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాత్రమే ఇవ్వాలని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డికి మెట్రో దినపత్రిక బ్యూరో ఇంచార్జ్ వెంకట్ వినతి పత్రం అందించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టు లందరికీ త్వరలో డబుల్ బెడ్ రూములు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.