సాయంత్రం వేళల్లో 250మందికి అన్నదానం
వేములవాడ నేటిదాత్రి
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం రెండు ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్న 250 మంది అన్నార్తులకు పేదలకు పంపిణీ చేయడం జరిగింది అన్నం పారవేయవద్దు పంచి పెడదాం అన్న కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి సహకారం అందిస్తూ మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వెజిటేబుల్స్ సంబంధించినవి మిగిలితే ట్రస్ట్ వారికి సమాచారం అందించండి వాటిని పేదలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, చంద్రగిరి నాగరాజు, ప్రతాప నటరాజు, జ్ఞానేశ్వర్, రాముల రాజేందర్, ఏనుగంటి లక్ష్మణ్, రాచకొండ నందయ్య తదితరులు పాల్గొన్నారు