బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత మేయర్ కు లేదు?

@ వరంగల్ బిఆర్ఎస్ కార్పొరేటర్లు

మేయర్ పై అవిశ్వాస తీర్మానం?

కాంగ్రెస్ పార్టీలో చేరిన కానీ, మేయర్ కుర్చీ దక్కకుండా పోతుందా?

అధిష్టానం నుండి దక్కని అభయ హస్తం, ఏకమవుతున్న అన్ని పార్టీల కార్పొరేటర్లు?

సొంత పార్టీ కార్పొరేటర్ల నుండి సైతం వ్యతిరేకత?

నేటిధాత్రి వరంగల్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే మేయర్ పదవికి కాంగ్రెస్ పార్టీ నుండి కొండా వర్గంకు మేయర్ పదవి కోసం గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గుండు సుధారాణి సామాజికవర్గం నకు చెందిన 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ మేయర్ పదవి ఆశిస్తూ, మొదటి నుండి కొండా దంపతుల మద్దతుతో ఇప్పటికే దాదాపు అందరూ కార్పొరేటర్లను కలిసి మద్దతు కూడగట్టినట్లు సమాచారం. ఎలాగైనా తన పదవి కాపాడుకునేందుకు గుండు సుధారాణి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గుండు సుధారాణి కి బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల నుండి వ్యతిరేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేపు జరిగే బడ్జెట్ సమావేశాన్ని, నిర్వహించే అర్హత మేయర్ గుండు సుధారాణి కి లేదని, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో కమిషనర్ కి వినతిపత్రం సమర్పించారు బిఆర్ఎస్ కార్పొరేటర్లు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించాలని తెలిపిన బిఆర్ఎస్ కార్పొరేటర్లు. మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెడితే అన్ని పార్టీల కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version