గిరిజనులు స్వయంపాలనలో బ్రతకడం ఎమ్మెల్యే మాదవరెడ్డికి ఇష్టం లేదా?

ఎమ్మెల్యే దొంతి సొంత గ్రామంలో పతినాయక్ తండాను జీ.పీ విలీనం..!

గిరిజనుల స్వయంపాలనకు తూట్లు పొడుస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వం..

తండాల ఆత్మగౌరవం కోసమే జీ.పీ లుగా కేసీఆర్..

పత్తినాయక్ తండా ఘటనను ఖండించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట డివిజన్ పరిధిలోని గిరిజనులు స్వయంపాలనలో బ్రతకడం ఎమ్మెల్యే మాదవరెడ్డికి ఇష్టం లేదా? అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. చెన్నారావుపేట మండలంలోని పత్తినాయక్ తండా గ్రామపంచాయతిని అమీనాబాద్ లో విలీనం చేయాలనే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పెద్ది తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తండాలు ఆత్మగౌరవం,స్వయం ప్రతిపత్తితో బ్రతకాలనే ఉద్దేశంతో నాటీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని పేర్కొన్నారు.అందులో బాగంగానే నర్సంపేట నియోజకవర్గం పరిధిలో 76 నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసామని మాజీ ఎమ్మెల్యే పెద్ది వివరించారు.గత ప్రభుత్వం తండాలకు రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఈ నేపథ్యంలో వివిద దశల్లో ఉన్న రోడ్డు పనులను వెనక్కిపంపి తండాల అభివృధ్ధిని అడ్డుకున్న చరిత్ర కాంగ్రేస్ ది అని పేర్కొన్నారు.నేడు స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామం అమీనబాద్
లో పత్తినాయక్ తండాను విలీనం చేయాలనుకోవడం తండావాసుల ఆత్మగౌరవాన్ని దెబ్పతీయటమే అవుతుందని ఎద్దేవా చేశారు.తండా ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా భయటవారిని తీసుకువచ్చి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం అని ఆరోపించారు.గ్రామసభ అనేది గ్రామస్తులు,గ్రామ సంబందిత అధికారుల సమక్షంలో జరగాలి..అలాంటిది గిరిజనేతర,నియోజకవర్గ కాంగ్రేస్ నాయకుల సమక్షం వారి అభిప్రాయాన్ని తండావాసులపై రుద్దటాన్ని ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు.ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో అదికారులు, పోలీసులను అడ్డు పెట్టుకుని గ్రామస్తుల సమ్మతి లేకుండా గ్రామసభ నిర్వహించాలనుకోవడం మూర్కత్వం కాదా..? అని ప్రశ్నించారు.గిరిజనుల స్వయంపాలనలో బ్రతకడం ఎమ్మెల్యే మాదవరెడ్డికి ఇష్టం లేదా..? అని అడిగారు.నర్సంపేట డివిజన్ పరిధిలోని మిగిలిన 76 తండాల గ్రామపంచాయతీలను విలీనం చేసి గిరిజనులకు స్వయంపాలనను దూరం చేసే కుట్రలో బాగమే నేటి పత్తినాయక్ తండా సంఘటన అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.నేడు నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రేస్ నాయకులకు పోలీసులు,అదికారులు వంతపాడటం హేయమైన చర్య,గ్రామపంచాయతీల ఉనికి ప్రశ్నార్థకం చేసేదిగా ఎమ్మెల్యే తీరు ఉందని మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆరోపించారు.పత్తినాయక్ తండా గ్రామపంచాయతీని విలీనం చేసే కుట్రలో సొంత గ్రామంలోనే ప్రజలు తిరగబడే స్థితికి వచ్చింది,ఇది ఇలాగే కొనసాగితే గిరిజన లోకం మీకు తగిన బుద్ది చెబుతుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని హెచ్చరించారు.నేడు నియోజకవర్గంలో తండాలకు రోడ్లను అడ్డుకున్నదేకాక,గ్రామపంచాయతీలుగా ఉన్న తండాలను విలీనం చేయాలనుకోవటం ఎమ్మెల్యేకు గిరిజనుల పట్ల ఉన్న చిన్నచూపుకు ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు.
మీరు చేసిన ఈ దుశ్చర్యను తండా వాసులు వ్యతిరేఖిస్తుంటే పోలీసులు,అదికారులను తీసుకెల్లి భయబ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదని ఎమ్మెల్యేపై మండిపడ్డారు.ఇప్పటికైనా తండా విలీన ప్రక్రియ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version