మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే. అరుణ పర్యటించారు. పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ. గ్రామంలో కురువ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ. కలిమెర లింగేశ్వర స్వామి బండారు మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ఆశీస్సులు అందజేయాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద పొర్ల గ్రామస్తులు, బిజెపి నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

