భద్రాచలం నేటి దాత్రి
జర్నలిస్టులు ఉన్నత లక్ష్యంతో అడుగులు వేయాలి…
జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి కమిటీ ఏర్పాటు అభినందనీయం
ఐటిసి పి.ఎస్.పి.డి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాకాల దుర్గా ప్రసాద్
చీఫ్ మేనేజర్ చెంగలరావు సహకారంతో దీపావళి క్రాకర్స్ అందజేత
జర్నలిస్టు ఫోరం ఆఫ్ భద్రాద్రి ఆధ్వర్యంలో దుర్గా ప్రసాద్ దంపతులకు సన్మానం
భద్రాచలం :
ప్రతి ఒక్కరి జీవితాలలో దీపావళి కాంతులు నిండాలని, జర్నలిస్టులు నూతనోత్సాహంతో ముందుకు సాగాలని, జర్నలిస్టులు ఉన్నత లక్ష్యంతో అడుగులు వేయాలని, నూతనంగా జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి కమిటీ ఏర్పాటు అభినందనీయమని ఐటిసి పి.ఎస్.పి.డి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాకాల దుర్గా ప్రసాద్ అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని చీఫ్ మేనేజర్ చెంగలరావు సహకారంతో ఐటిసి పి.ఎస్.పి.డి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాకాల దుర్గా ప్రసాద్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆఫ్ భద్రాద్రి కమిటీ సభ్యులకు దీపావళి క్రాకర్స్, స్పెషల్ గిఫ్ట్ ప్యాక్స్ అందజేశారు. అనంతరం జర్నలిస్టు ఫోరం ఆఫ్ భద్రాద్రి ఆధ్వర్యంలో దుర్గా ప్రసాద్ దంపతులను సన్మానం చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజల సమస్యలను ఎత్తిపట్టాలని, వాటి పరిష్కారానికి వేదికగా మారాలన్నారు. ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలన్నారు. జర్నలిస్టులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు జర్నలిస్ట్ ఫోరమ్ ఆఫ్ భద్రాద్రి కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిటీ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు ఆనంద్, జోసెఫ్, అల్లాడి వెంకటేశ్వరరావు, అనిల్ రామాచారి సాయిబాబా, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.