వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గురువారం ఉమ్మడి కరీంనగర్ నూతన జిల్లా రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ రాజన్నను దర్శించుకొని, ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం జిల్లా రిజస్ట్రార్ మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే ప్రతి వినియోగదారునికి అందించే సేవల్లో ఎలాంటి లోపం ఉండొద్దని, వినియోదారులకు అందించే సేవల వివరాలను స్థానిక సబ్ రిజిస్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా రిజిస్టర్ కార్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సబ్ రిజిస్టర్ కు సూచించారు. కార్యాలయ రికార్డులను కూడా తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆయన వెంట స్థానిక సబ్ రిజిస్టర్ చెర్ల సురేంద్రబాబు, ఆఫీస్ సిబ్బంది ఉన్నారు.
