మంగపేట-నేటిధాత్రి
సున్నం మురళీకృష్ణ జయంతి సందర్భంగా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి లో అక్టోబర్ 20 తారీకు నుండి 22 తారీకు వరకు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు యూత్ అధ్యక్షులు బాడిష ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ముఖ్య అతిథులుగా హాజైరై పోటీలు ప్రారంభించనున్నారు. ఈ టోర్నమెంట్లో ములుగు జిల్లాలోని మండలాల తో పాటు పినపాక మరియు కరకగూడెం మండలాలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులు19 వ తారీకు ఉదయం 11 గంటల లోపు టీం యొక్క పేర్లు నమోదు చేసుకోవలని, నమోదు చేసుకోవడానికి 9491717268,7032428438 నంబర్లను సంప్రదించాలని కోరారు.