భూపాలపల్లి నేటిధాత్రి
పదవతరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షా సరళిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
జిల్లాలో పదవతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని
పరీక్షా కేంద్రంలో వైద్య శిభిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పరీక్షా కేంద్రంలో 210 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 209 హాజరయ్యారని తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు ఏదేని అస్వస్థతకు గురైన తక్షణమే వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసులకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాల రవాణాలో పోలీస్ ఎస్కార్ట్ తో చేయాలన్నారు. జవాబు పత్రాలు తరలింపుకు తహసీల్దార్, ఎంపిడిఓల క్లోస్డ్ వాహానంలో తరలించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు, కాలిక్యూలేటర్లు అనుమతించొద్దని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్ధులతో పాటు, సిబ్బందిని నిశిత పరిశీలన తదుపరి తర్వాతనే అనుమతించాలని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3547 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు వ్రాస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షలు నిర్వహణ పర్యవేక్షణకు 20 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 20 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 20 మంది సిట్టింగ్ స్క్వాడ్లు, 240 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ముగ్గురు సెంటర్ కస్టోడియన్లు, ఇద్దరు రూట్ ఆఫీసర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.